
జనం న్యూస్ 25 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్జో గులాంబ గద్వాల్ జిల్లా తెల్లవారుజామున కుక్కల స్వైరవిహారం భయాందోళనలో కాలనీవాసులు గద్వాల పట్టణంలోని చింతలపేటలో మంగళవారం తెల్లవారుజామున వీధి కుక్కలు దాడి చేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కుక్కల దాడిలో బాధితుల చేతులు కాళ్లు తొడల భాగాల్లో గాయాలయ్యాయి. వెంటనే వారిని గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ స్వైరవిహారం చేస్తున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని ప్రజలు, చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు. వీధి కుక్కలను పట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలించాలని వార్డు కౌన్సిలర్ ముత్యాల లక్ష్మీ తనయుడు రవిరెడ్డి పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.