
జనం న్యూస్ నవంబర్ 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లిలోని ఎన్.కే.ఎన్.ఆర్. గార్డెన్స్‌లో అంకర్ల వారి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. మిత్రుడు రాము ఆహ్వానం మేరకు ఈ వివాహ వేడుకకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు పూజశ్రీ, హరికిరణ్‌లను ఆత్మీయంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన దంపతుల జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వివాహ వేడుకలో ఆయన పాల్గొనడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సంతోషం వ్యక్తం చేశారు.