
జనం న్యూస్ 25 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్జో గులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలం నెలలు గడుస్తున్నా కూలీల ఖాతాల్లో పడని వేతనాలు.. నిరుపేద కుటుంబాలకు తప్పని ఆర్థిక ఇబ్బందులు. వీబీ జీ రామ్జీ పథకం కింద పనిచేస్తున్న గ్రామీణ కూలీలకు నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతనాలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు సింధనూర్ గంగాధర్
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కూలీలు తమ కుటుంబాల పోషణ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. కానీ చేసిన పనికి సకాలంలో వేతనాలు అందక అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కూలీల కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు, వారికి రావాల్సిన డబ్బులను వెంటనే అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది మా డిమాండ్: పెండింగ్లో ఉన్న కూలీల వేతనాలను తక్షణమే విడుదల చేయాలి. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చెల్లింపులు పూర్తి చేయాలి. వేతనాల చెల్లింపులో జాప్యానికి కారణాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా చర్యలు చేపట్టాలి. కష్టపడి పనిచేసిన కూలీకి తన చెమట చుక్కకు తగిన వేతనం సకాలంలో అందాలి. పేద కూలీల పొట్టకొట్టే వేతనాల జాప్యాన్ని ప్రభుత్వం వెంటనే నివారించాలి ఇది మా పార్టీ డిమాండ్ మాత్రమే కాదు.. నిరుపేద కూలీల న్యాయమైన హక్కు కోసం మా పోరాటం తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రభుత్వానికి సంబంధిత శాఖల అధికారులకు విజ్ఞప్తిని ఇట్లు, సింధనూర్ ఉప్పరి గంగాధర్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల సలహాదారుడు బసవ స్వామి మండల ఉపాధ్యక్షులు భీమేష్ తిరుమలేష్ నాయుడు.