
జనం న్యూస్ నవంబర్ 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం గ్రామాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సక్రమంగా ఖర్చు పెట్టేందుకు పంచాయితీల కు ఎన్నికలు ప్రకటించినందున ఈరోజు అరకు నియోజకవర్గంలో ముంచింగి పుట్టు మండలo పంచాయితీ గ్రామాల్లో నియోజకవర్గ ఇన్చార్జి సియ్యర్ దన్ను దొర నియోజవర్గ పరిశీలకులు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు కలిసి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు మాట్లాడుతూ గత వైసిపి పాలనలో గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులను మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిధులను మళ్లించి స్వప్రయోజనాలు కోసం వాడుకున్నారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ అభివృద్ధి జరిగితేనే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఆలోచనతో నిధులు మంజూరు చేసి అరకు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో రోడ్లు కాలువలు నిర్మాణాలు జరిగాయని, ఇప్పుడు పంచాయతీలు ఏకగ్రీవం జరిగితే 50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని, సర్పంచ్ వార్డు మెంబర్లు గా పోటీ చేసే అభ్యర్థులు అధికారం కోసం వచ్చే వారిని కాదు, ప్రజలు అవసరాల కోసం నిలబడే వారిని గుర్తించి ప్రజాసేవ లక్ష్యంగా పనిచేసే నాయకత్వాన్ని ఎన్నుకున్నట్లయితే మీ గ్రామానికి మంచి ప్రయోజనాలు జరుగుతాయని, కనుక కూటమి తరపు నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం జనసేన బిజెపి మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాగ జగదీష్ దొన్ను దొర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.