
జనం న్యూస్, నవంబర్ 25, ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ:* డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం: ఈరోజు ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కట్టా సత్తిబాబు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యుడు మరియు ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు పాల్గొని, నాయకులు, కార్యకర్తల మధ్య భారీ కేక్ కట్ చేసి ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ, సాయి పార్టీలో బాధ్యతతో పని చేస్తూ, ప్రతి ఒక్కరికీ జిల్లాలో అందుబాటులో ఉండి పార్టీ కోసం సేవలు అందిస్తున్నాడని, సాయికి ఇంకా ఉన్నత పదవులు రావాలని, ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుత్తుల సాయికి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డు కులాల సంస్థ సంచాలకుడు చెల్లి అశోక్, ములపర్తి బాలకృష్ణ, విల్ల వీరాస్వామి నాయుడు, గొల్లపల్లి గోపి, రెడ్డి సుబ్బారావు, ఎస్ఎంఎస్ ప్రసాద్, నిమ్మకాయల విష్ణు, బడుగు సందీప్ సాయి, సానబోయిన దుర్గాదేవి, దొమ్మేటి వెంకటేశ్వర్లు, పిల్లి నాగరాజు, కడలి నాగు, జాగు సత్తిబాబు, సానబోయిన చంటి, కాకి మాణిక్యం, అబ్బాస్, రెడ్డి బాలకృష్ణ, బడుగు రవి, కటికిదల నాని, అఖిల్, సభ్యులు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
