
జనం న్యూస్ 26 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్రో డ్డు ప్రమాదంలో యువకుడు మృతి మరో ఇద్దరి పరిస్థితి విషమం ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని వంతెన నిర్మాణం.. పాలకులు మారినా మారని పరిస్థితి జోగులాంబ గద్వాల జిల్లా అయిజ ప్రాంతంలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం.ఈ ప్రమాదానికి అతివేగం, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం కారణమై ఉండవచ్చని భావిస్తున్నప్పటికీ ఈ రహదారిపై ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న వంతెన నిర్మాణమే ప్రమాదాలకు ప్రధాన కారణమని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏళ్లు గడుస్తున్నా వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం ప్రజలకు శాపంగా మారింది. ప్రభుత్వాలు మారాయి పాలకులు మారారు రాజకీయ పార్టీలు మారాయి కానీ ఈ వంతెన పరిస్థితి మాత్రం మారలేదు గత ప్రభుత్వం వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయలేదనే కారణంతో మరో పార్టీకి అవకాశం ఇచ్చినా ఇప్పటివరకు ప్రస్తుత పాలకులు కనీసం ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదని స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అసంపూర్తి వంతెన సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం రహదారిపై భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోతే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందిస్తారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని, అప్పటివరకు ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు, ఇతర భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత స్పందించడం కాదు.. ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
