
జనం న్యూస్ సెప్టెంబర్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని వివిధ గ్రామా ల్లోని గణపతులు నవరా త్రులు ముగించుకొని నిమజ్జనం చేసే ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారు భద్రతా ఏర్పాట్లను మండల స్థాయి అధికారులు క్షేత్రస్థా యిలో పరిశీలించారు. ప్రగతి సింగారం వద్ద గల చలివాగు ప్రాజెక్టు బ్రిడ్జి, అలాగే గ్రామ పరిధిలోని దేవుని కుంట, తాళ్ళ కుంటలను అధికారులు పరిశీలించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సమీక్షించారు. నిమజ్జన ప్రాంతాల వద్ద ప్రమాదాలు జరగకుండా బారికేడ్ల ఏర్పాటు, తగినంత వెలు తురు కోసం విద్యుత్ దీపా లు, క్రేన్ల ఏర్పాటు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్సవ కమిటీలు, నిర్వా హకులు పోలీసు రెవెన్యూ శాఖల నిబంధ నలను పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో విజయవం తం చేయాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ సుధాకర్ రెడ్డి, తహ సీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎస్సై జక్కుల పరమేశ్వర్, ఎంపీడీవో ఫణి చంద్ర, టీజీఎస్పీడీసీ ఎల్ చొక్కారావు అధికా రులు పాల్గొన్నారు.