
జనం న్యూస్ 26 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్జో గులాంబ గద్వాల్ జిల్లా లో నదీ అగ్రహారం రహదారిపై ఘటన మృతుడు చెన్నుగోనిపల్లికి చెందిన సుధాకర్‌గా గుర్తింపు జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ జిల్లా పట్టణంలోని నదీ అగ్రహారం వెళ్లే రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తున్న ఓ యువకుడు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చింతచెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడిని చెన్నుగోనిపల్లి గ్రామానికి చెందిన సుధాకర్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
