
జనం న్యూస్ నవంబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రాజ్యాంగ విలువలను ప్రతి విద్యార్థి తెలుసుకుని బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల ప్రధాన ఉపాధ్యాయులు టి. రేవతి అన్నారు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల బాలుర పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో భారత రాజ్యాంగ పీఠికను తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సామూహికంగా పఠింపజేశారు. రాజ్యాంగంలోని అధికరణాలను ప్రదర్శించి విద్యార్థులతో చదివించారు. అనంతరం వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రాథమిక హక్కులు, విధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు టీచర్లు విద్యార్థులు గురుకుల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.