
జనం న్యూస్ 27 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ చిన్నారులు అస్వస్థత ఆసుపత్రుల్లో చేరిక గద్వాల మండలం గోనుపాడు గ్రామ సమీపంలోని డంపింగ్ యార్డ్ నుంచి గత రెండు రోజులుగా భారీగా పొగలు వెలువడుతుండటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పొగ కారణంగా చిన్నారులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు డంపింగ్ యార్డ్‌ను తక్షణమే మరో ప్రాంతానికి తరలించి మంటలను ఆర్పేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం గ్రామ సర్పంచ్ రాములమ్మ, ఉపసర్పంచ్ సత్తెమ్మ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాష షేక్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ సమస్యపై తక్షణ చర్యలు తీసుకుంటామని మంటలను ఆర్పించడంతో పాటు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ నాయకులు రాముడు ఆంజనేయులు బొట్టు అంజి 10వ వార్డు సభ్యుడు రాజు దాసు తదితరులు పాల్గొన్నారు