
జనం న్యూస్ 23 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్నీ టిని దిగువకు విడుదల చేయనున్న కర్ణాటక ప్రభుత్వం ఈ సందర్బంగా తెలంగాణ సీఎం కీ కర్ణాటక సీఎం కీ మంత్రులకు కృతఙ్ఞతలు తెలిపిన గద్వాల ఎమ్మెల్యే ఈరోజు బెంగళూరులొ కర్ణాటక సీఎం శివకుమార్ ను కలిసిన ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రివర్యులు జిల్లా ఎమ్మెల్యేలతో పాటు గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సాగునీటి కోసం చర్చలు సఫలం నీటి విడుదలకు ఒప్పుకున్నా డీకే శివ కుమార్ గద్వాల జిల్లా రైతన్నల సాగునీటి అవసరాల కోసం గద్వాల ఎమ్మెల్యే నిరంతర కృషి, చొరవతో సాగిన చర్చలు సఫలమయ్యాయి. రైతుల పంటలకు అవసరమైన సాగునీటిని అందించేందుకు ఎమ్మెల్యే తెలంగాణ సీఎం తో నిరంతరం చర్చిస్తూ గద్వాల జిల్లా రైతుల సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు
రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కర్ణాటక సీఎం తో చర్చలను ఏర్పాటు చేసి నీటిని విడుదల చేసుకునేలా చర్యలు చేపట్టేందుకు సానుకూల నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.ఎమ్మెల్యే కృషి ఫలితంగా గద్వాల జిల్లా రైతన్నలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు సాగునీరు అందడంతో రైతులకు భరోసా కలగనుంది. రైతు సంక్షేమమే లక్ష్యంగా గద్వాల జిల్లా అభివృద్ధి కోసం ఎమ్మెల్యే చేస్తున్న కృషికి నిదర్శనం ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి కీ ఉమ్మడిజిల్లా ఎమ్మెల్యేలు మేఘ రెడ్డి కీ జి మధుసూదన్ రెడ్డి కీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన గద్వాల ఎమ్మెల్యే.