
జనం న్యూస్ తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 23. తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థులకు బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెలకు అవసరమైన నిత్యావసర సామగ్రిని అందజేశారు. సబ్బులు, డిటర్జెంట్లు, టూత్‌పేస్ట్, బ్రష్‌లు, నెయిల్ కట్టర్లు, షాంపూలు, కొబ్బరి నూనె, పౌడర్ తదితర వస్తువులను పంపిణీ చేశారు. ప్రతి నెల విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించడం అభినందనీయమని ఉపాధ్యాయులు సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి సేవ చేయాలని హెచ్ఎం ముత్తోజు సుధాకర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ జి. శ్రీనివాసులు, అవార్డు డైరెక్టర్ కె. ప్రదీప్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.