
న్యూస్ ;24 సెప్టెంబర్ గురువారం : సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; ఎక్కడైనా డాక్టర్స్ హాస్పిటల్ నిర్వాణ చేసుకుంటారు కానీ మన సిద్దిపేటలో వ్యాపారస్తులు హాస్పిటల్ నిర్వహణ చేస్తూ డాక్టర్లకు జీతాలు ఇస్తారు (అందరూ కాదు కొందరు) ఇలా నిర్వహిస్తున్న హాస్పిటల్లో మెడికల్ ల్యాబ్లు వారివే అర్హత లేని టెక్నీషియన్స్ పెట్టుకొని అవసరం ఉన్నా లేకపోయినా వేల రూపాయల టెస్టులు చేపించి 90% లాభాన్ని పొందుతున్నారు అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు చేపిచ్చి పేద ప్రజల జోబులు కాలీ చేస్తునరు మెడికల్ షాప్ వారియే ఇందులో క్వాలిఫై ఫార్మసిస్టు అంతంత మాత్రమే కొన్ని మెడిసిన్స్ లో 30 శాతం నుండి 80% వరకు లాభాలు అర్జిస్తున్నారు ఇక ఇన్సూరెన్స్ ఉంటే కావాలని అడ్మిట్ చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ నుండి లక్షల రూపాయలు లాగేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరూ సంపాదించనంత సంపాదన మన సిద్దిపేటలో డాక్టర్లు కానీ డాక్టర్లు సంపాదిస్తున్నారంటే అతిశయోక్తి కాదు చాలా హాస్పిటల్స్ ఫైర్ సెక్యూరిటీ లేదు పార్కింగ్ సౌకర్యాలు లేవు కమర్షియల్ బిల్డింగులలో హాస్పిటల్ నిర్వహణ జరుగుతున్నది అయినా మన ఉన్నతాధికారులకు అవేవీ కనిపించడం లేదు మామూళ్ల మత్తులో ఊగుతున్నారని విమర్శలు ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి హాస్పిటల్స్ మీద నియంత్రణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది సిద్దిపేటలోని హాస్పిటల్ లో ఈ సీజనల్ వ్యాధుల వల్ల అడ్మిట్ అవుతున్న వాళ్లు ఉన్న బంగారం భూములు అమ్ముకుంటున్నారు ఈ విషయం మీద ఉన్నత అధికారులు డి ఎం హెచ్ ఓ కాసింత శ్రద్ధ పెడితే బాగుంటుంది.