జనం న్యూస్:22 అక్టోబర్ గురువారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ బాలసాహిత్య పుస్తకాలు ప్రతి పాఠశాల గ్రంథాలయాలలో ఉండాలని, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ అన్నారు. సిద్దిపేటలో బుధవారం జరిగిన ప్రతినెల మన బాలసాహిత్య కార్యక్రమంలో కవి, గాయకులు వరుకోలు లక్ష్మయ్య రచించిన బంగారు నెమలి బాలగేయ సంపుటి ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్బంగా కాంతికృష్ణ మాట్లాడుతూ బాలసాహిత్యం నేటి సమాజానికి ఎంతో అవసరమని, బాలల శ్రేయస్సుకు బాలసాహిత్యం అవసరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విశేషంగా బాలసాహిత్య కృష్ణి జరుగుతుందన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఎన్నవెళ్ళి రాజమౌళి మాట్లాడుతూ బాలగేయాలు పాడుకోవడానికి అనువుగా ఉంటాయని, బాలలు గేయాలు పాడుతూ నూతన ప్రపంచంలోకి వెళ్తారని, బాలసాహిత్య రచనలు నిరంతరం వస్తాయన్నారు. బాలసాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షులు ఉండ్రాళ్ళ రాజేశం మాట్లాడుతూ మాత్రాలయానుగుణమైన బాలగేయ రచనలు అజరామరమని, వరుకోలు లక్ష్మయ్య రచించిన బంగారు లేడి బాలగేయాలు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. బంగారు లేడి బాలగేయ సంపుటి రచయిత వరుకోలు లక్ష్మయ్యను ఘణంగా సత్కరించారు. కార్యక్రమంలో బాలసాహిత్య రచయితలు పెందోట వెంకటేశ్వర్లు, డబ్బికార్ సురేందర్, బస్వ రాజ్ కుమార్, కాల్వ రాజయ్య, మళ్ళముల కనకయ్య, అనిశెట్టి సతీష్ కుమార్, డాక్టర్ బి.సుధాకర్, మిట్టపల్లి పర్శరాములు, ఉప్పరి బాలచంద్రం, ఎడ్ల లక్ష్మిభూంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.