
జనం న్యూస్: అక్టోబర్ 19 సోమవారంసిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి: వై.రమేష్తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఐకమత్యానికి, ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు. ప్రకృతిలో లభించే వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ మహిళలందరినీ ఒకచోట చేర్చి, సంతోషాలను పంచుకునే అపురూపమైన వేడుకగా నిలుస్తుంది. తెలంగాణ సంప్రదాయాలు, జానపద గీతాలు, పూల అందాలతో పల్లెలు, పట్టణాలు పండుగ కళను సంతరించుకుంటాయి. ఈ పండుగ మహిళల్లో ఐకమత్యాన్ని పెంపొందించడంతో పాటు, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.