
జనం న్యూస్ అక్టోబరు 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూరంపేట గ్రామంలో శ్రీ భవాని మాత విగ్రహ ప్రతిష్ఠాపన దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలో తొలిసారిగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.విగ్రహ దాత పావురాల రేణుక–సారంగం దంపతులు ఎంతో భక్తిశ్రద్ధలతో విగ్రహాన్ని సమకూర్చగా, శ్రీ దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో సూరం శశిపాల్ రెడ్డి, అడప ప్రభాకర్, చీర్ల సాయిరెడ్డి, పగడాల రాజుతోపాటు కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.....