
జనం న్యూస్ మే 12, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని, దోమ మండలం గూడూరు గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో యువ నాయకులు,పిసిసి మెంబర్ డాక్టర్ టి.రితిక్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామ పెద్దలు, యువతతో కలిసి కార్యక్రమంలో పాల్గొని భక్తి భావాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు రితిక్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.