
జనం న్యూస్ మే 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : భారతీయ సంస్కృతిలో అత్యంత శక్తివంతమైన దైవంగా, ప్రతి గ్రామం పొలిమేరలో భక్తికి మారుపేరుగా కొలవబడే ఆంజనేయస్వామి జన్మదినోత్సవం దేశమంతటా వివిధ సమయాల్లో జరుపుకోవడం ఆసక్తికరమైన అంశం అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో వైశాఖమాసం కృష్ణ పక్ష దశమి తిధినాడు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శ్రీ పరమేశ్వరి పార్క్ జంక్షన్ వద్ద ఉన్న భక్తాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి పుష్పాలంకరణ చేసి తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు నిర్వహించారని, ఈరోజు ఉదయం స్వామిని దర్శించుకోవడానికి మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మరియు భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ ఆంజనేయ స్వామి ని దర్శించుకోవడానికి వెళ్లిన సందర్భంగా అర్చక స్వాములు ప్రత్యేకంగా పూజ నిర్వహించి హారతి స్వీకరించిన అనంతరం దేవస్థానం ట్రస్ట్ పొలిమేర నాయుడు నాగ జగదీష్ ను శాలువాతో సత్కరించారని, అలాగే భోగలింగేశ్వర స్వామి చైర్మన్ సత్యనారాయణ కి కూడా శాలువాతో సత్కరించారి స్వామి వారి ప్రసాదాన్ని అందించారు. స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారు జామునుండే భక్తులు తరలి వచ్చారని, వారందరికీ ప్రసాద విత్తరణ చేసామని ట్రస్టీ పొలిమేర నాయుడు కుటుంబ సభ్యులు తెలియజేశారు.