
జనం న్యూస్ సెప్టెంబర్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన తల్లి దివ్యాంగుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు గజ్జి శంకర్ అనంతరం ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరవనిత తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని అన్నారు తెలంగాణ భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత ఐలమ్మ తెలంగాణ రైతాంగ పోరాటంలో ఐలమ్మ చూపిన తెగువ అందరికీ ఆదర్శమని ఆమె ధైర్యం ఆమె పోరాటం నేటి తరానికి స్ఫూర్తి దాయకం తెలంగాణ చరిత్ర లో ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం అని అన్నారు.