
జనం న్యూస్ మే 15 అమలాపురంఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అమలాపురం వారి ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా దాతల సహకారంతో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రాన్ని శుక్రవారం ఉదయం అమలాపురం ఆర్టీసీడిపో నందు ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకై ఏర్పాటు చేయగా2 వ రోజు నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రాన్ని శుక్రవారం ఉదయం రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు నంబూరి విశ్వనాథం, అధ్యక్షుడు యర్రమిల్లి విశ్వేశ్వరరావు (విస్సు ),కార్యదర్శి నూలు సూరిబాబు, కోశాధికారి శ్రీకాకోలపు రాంపండు తదితరులు వారి సేవలను అందించారు ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకై మరికొద్ది రోజులు ఆర్టీసీ డిపో నందు మజ్జిగ చలివేంద్రంన్ని ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు.