
జనం న్యూస్ నవంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చెయ్యేరు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరును పరిశీలించి, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అమలాపురం డీఎస్పీ టి.వి.ఎస్. ప్రసాద్, ముమ్మిడివరం సీఐ మోహన్ కుమార్, కాట్రేనికోన ఎస్సై దుర్గా శ్రీనివాస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.