
జనం న్యూస్, సెప్టెంబర్ 18,అచ్యుతాపురం : చిరుధాన్యాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉండవచ్చని, చిరుధాన్యాలే ఆరోగ్యానికి అమృతమని అందలాపల్లి అంగన్వాడీ టీచర్ కాండ్రేగుల హేమలత పేర్కొన్నారు. జాతీయ 9వ పోషణ మాసోత్సవంలో భాగంగా శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై బాలింతలు, గర్భిణులకు అవగాహన కల్పించారు. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలు వంటి చిరుధాన్యాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఆయా పదార్థాల్లో మెరుగైన పోషకాలు ఉంటాయన్నారు. రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలతో చేసిన వంటకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మంగ, ఎమ్ ఎల్ హెచ్ రమ్య, జీవి సత్యవేణి, ఆశా వర్కర్ శేసరత్నం గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.