
జనం న్యూస్ మే 09:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో వరి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. శనివారం వేల్పూర్‌లోని వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో మాజీ ఎంపీటీసీ సున్నపు అంజయ్య, జిట్టావోయిన రాజు, నాయుడు పోశెట్టి తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం కే. చంద్రశేఖర్ రావు నాయకత్వమే అవసరమని భావించి బీఆర్ఎస్లో చేరుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజా పూర్ణనందం, ఉపేందర్ రెడ్డి, గుళ్ళే రాజేశ్వర్, మధుసుధన్, బర్మా నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.