
జనం న్యూస్ : 3 నవంబర్ మంగళవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్; శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం ప్రతి యేట అందిస్తున్న డాక్టర్ ఎం.ఎల్ నరసింహారావు సాహితీసేవా పురస్కారం 2026 సంవత్సరానికి గాను సిద్దిపేటకు చెందిన ప్రముఖ కవి, రచయిత, కథాశిల్పి ఐతా చంద్రయ్య ఎంపికైనట్లు బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు. 11నవంబర్ రోజున హైదరాబాద్ లో చంద్రయ్య పురస్కారం అందుకోనున్నారు. తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేస్తూ అనేక ప్రక్రియల్లో రచనలు చేయడమే కాకుండా శతాధిక గ్రంథకర్త ఐనా ఐతా చంద్రయ్య డాక్టర్ ఎం.ఎల్ నరసింహారావు సాహితీసేవా పురస్కారం 2026 ఎంపిక కావడం పట్ల జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఎన్నవెళ్ళి రాజమౌళి, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, కాల్వ రాజయ్య, సింగీతం నరసింహారావు, ఉప్పరి బాలచంద్రం, పెందోట వెంకటేశ్వర్లు, డాక్టర్ బి.సుధాకర్ తదితరులు అభినందనలు తెలిపారు.