
కుటుంబ సభ్యులకు పరామర్శ.. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన మైలారపు లింబాద్రి
జనం న్యూస్, సెప్టెంబర్ 21, జగిత్యాల జిల్లా, మెట్పల్లి : కోరుట్ల నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్చార్జి డాక్టర్ రఘు మాతృమూర్తి పుష్పలత ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి సోమవారం డాక్టర్ రఘు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, డాక్టర్ రఘు కుటుంబ సభ్యులను ఓదార్చారు. పుష్పలత మృతి కుటుంబానికి తీరని లోటని, ఆమెను కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.అనంతరం డాక్టర్ రఘుతో పాటు కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.ఈ పరామర్శ కార్యక్రమంలో మెట్ పల్లి పట్టణ 4వ, మరియు 13 వ వార్డు కౌన్సిలర్లు అజయ్, రమేష్తో పాటు పలువురు పాల్గొని డాక్టర్ రఘు కుటుంబాన్ని పరామర్శించారు