
జనం న్యూస్ నవంబర్ 3 చిలిపి చెడు మండల ప్రతినిధి చిలిపిచేడ్ తహసీల్దార్ కార్యాలయం లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందచేత.మెదక్ జిల్లాలో బోనాలు, బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్బంగా దళితులపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయాలని, కులవివక్షత పాటించిన వారిపై చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా దళితులపై దాడుల వ్యతిరేక పోరాట కమిటి చిలిపిచేడ్ తహసీల్దార్ కార్యాలయం లో సీనియర్ అసిస్టెంట్ శ్రీహరి కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా కేవీపీస్ జిల్లా ఉపాధ్యక్షులు డప్పు మల్లేశం మాట్లాడుతూజిల్లాలోని మనోహరాబాద్ మండలం కోనాయపల్లి, శివ్వంపేట మండలం నవాబ్ పేట్ గ్రామల్లో బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా దాడి చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. కుచారం గ్రామంలో దళిత మహిళా సర్పంచ్ ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనకుండా కుల వివక్షత పాటించి అవమానించారనీ, తుప్రాన్ మండలం వెంకటయపల్లి గ్రామంలో బోనాల సందర్బంగా గుడికి దళితులు వెళ్లే దారిని ముసి వేసి అనగరికంగా వ్యవహారించారాని మండిపడరు. వెల్దుర్తి మండలం ఎదులపల్లి గ్రామంలో దళిత మహిళా సర్పంచ్ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటే అడ్డుకుని అడనివ్వలేదు. తుప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో దళిత మహిళలు బతుకమ్మ ఆడినందుకు సాంఘిక బహిష్కరణ చేశారు. హవెలి ఘనపూర్ మండలాల్లో దళితులపై దాడి జరిగింది.
పై ఘటనల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయినా నేటికీ విచారణ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం సీనియర్ నాయకులు లింగగాలా ప్రకాష్, కేవీపీస్ నాయకులు మల్లేశం పాల్గొన్నారు.