
జనం న్యూస్ మే 10 ముమ్మిడివరం ప్రతినిధి ; డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కాట్రేనికోన గ్రామపంచాయతీ ఏరియాలోని సిసి డ్రైన్ మూసుకుపోవడం వలన రాబోవు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని కాట్రేనికోన గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మరియు ఎంపీడీవో, బి రాజేశ్వర రావు వారి ఆదేశాలతో కాట్రేనికోనలో నిర్మించిన డ్రైనేజీలలో పూడికతీత పనులు పనులు గత కొన్ని రోజుల నుంచి జోరుగా సాగుతున్నాయి. డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండడంతో మురుగునీరు సమస్యలు సమస్యలు తలెత్తకుండా వర్షాకాలం రాకముందే పూడిక తీత పనులు చేపట్టామని ఈవో జేవిబి సత్యనారాయణ తెలిపారు. గ్రామస్తులు ఇకనైనా డ్రైనేజీలలో చెత్త సదారం, కొబ్బరి బొండాలను వేయకుండా సహకరించాలని ఈవో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎం సత్యనారాయణ , డి రాజు బి శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు