
జనం న్యూస్ సెప్టెంబర్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తల్లి దివ్యాంగుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు గజ్జి శంకర్ ఆచార్య స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ 14 వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని పెదకోడేపాక, గ్రామంలో తల్లి దివ్యాంగుల సేవా సమితి కమిటీ హల్ కొరకు ప్రభుత్వ భూమి కలదు అట్టి భుమి సర్వే నంబర్ 1212, 1213, లో గల ప్రభుత్వ భుమి కలదు . అట్టి భూమిని సర్వే చేయించి మాకు తల్లి దివ్యాంగుల సేవా సమితి కమిటిహలు కోరకు అట్టి భూమిని " మంజూరు చేయించగలరని పెద్దకోడేపాక గ్రామ తల్లి దివ్యాంగులను ఆదుకోవాలని మాకు భూమిని మంజూరు చేయగలరని ఎం పి డి ఓ ఫణి చంద్ర కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కే. శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శి టి. శంకర్ అధ్యక్షుడు అబ్బు రఘుపతి రెడ్డి,ఉపాధ్యాక్షుడు సిఎచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు....