
జనం న్యూస్ మే 11 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని ఫైజాబాద్ గ్రామం లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డా. ఏ. వి. రామాంజనేయులు గారు(ప్రధాన శాస్త్రవేత్త) పంట అవశేషాలను తగలబెట్టకుండా, యంత్రాల సహాయం తో కలియదున్నితే నేల సారం పెరుగుతుందని సూచించారు. వివిధ పంటలలో రసాయన వినియోగన్ని తగ్గించే మార్గాలను, మరియు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను కూలంకషంగా వివరించారు. యూరియా కు ప్రత్యామ్నాయ మార్గాలైన పచ్చి ఆకు ఎరువులు, జీవన ఎరువులు మరియు సేంద్రియ ఎరువుల వాడకం పై ప్రేమ్ (వ్యవసాయ శాస్త్రవేత్త) అవగాహన కల్పించారు. మార్కెట్ లో గిరాకీ ఉన్న వరి రకాలను ఆర్ ఎన్ ఆర్ 15048, కే ఎన్ ఎం 1638, జై శ్రీరామ్ హెచ్ఎంటి సోనా డబల్ జి ఎల్962, డబల్ జి ఎల్ 44, జె జి ఎల్ 1798)వాడటం, సాగు నీటిని ఆదా చేయడం అనే అంశాల పై ఏవో రాజశేఖర్ గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అనిత , టి. రామయ్య గ్రామ సర్పంచ్ ఫైజాబాద్ గ్రామ రైతులు గోపాల్ రావు, సంగయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.