
జనం న్యూస్ ; 2 అక్టోబర్ శుక్రవారం ; సిద్ధిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై.రమేష్ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట ఇంటర్నేషనల్ 320డీ ఆధ్వర్యంలో ముగ్గురు ఇంజనీర్లను ఘనంగా సన్మానించారు. ఇంజనీర్లు రచ్చ నరేందర్, ఎం.డి. అన్వర్, ఎం.డి. సలీమ్ ఉద్దీన్లను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లగిశెట్టి నరసింహులు, కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి శ్రీనివాస్, జెడ్సీ దాసరిపల్లి జోజి తదితరులు పాల్గొన్నారు.