
బిచ్కుంద, సెప్టెంబర్ 19 జనం న్యూస్ వినాయక నవరాత్రుల సందర్భంగా బిచ్కుంద మున్సిపల్ పరిధిలో నిర్వహించ నున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు నిమజ్జన రూట్‌ను పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ మరియు విద్యుత్ శాఖల అధికారులు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా బాన్సువాడ డీఎస్పీ విటల్ రెడ్డి, బిచ్కుంద సీఐ రవికుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సీమ షడ్కర్, తహసీల్దార్ వేణుగోపాల్, బిచ్కుంద ఎస్సై గుండెల రాజు, ఎలక్ట్రికల్ ఏఈ, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు సంబంధిత అధికారులు నిమజ్జన రూట్‌ను పరిశీలించారు.నిమజ్జన రూట్లో విద్యుత్ లైన్లు, రోడ్డు పరిస్థితులు, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల భద్రత, నిమజ్జనానికి సంబంధించిన ఇతర ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ విటల్ రెడ్డి గారు బిచ్కుంద ఎస్సై గుండెల రాజుతో పాటు మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.డీజేలకు అనుమతి లేదుగణేష్ నిమజ్జనం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలను ఉపయోగించరాదని అధికారులు స్పష్టం చేశారు. నిమజ్జన కార్యక్రమంలో సాంప్రదాయ వాయిద్యాలైన డప్పు, బ్యాండ్ తదితర వాయిద్యాలను మాత్రమే వినియోగించాలని గణేష్ మండపాల నిర్వాహకులకు సూచించారు.నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిర్వాహకులు, ప్రజలు పోలీస్ మరియు సంబంధిత శాఖల అధికారులకు సహకరించాలని అధికారులు కోరారు.