
జనం సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం సెప్టెంబర్ 17. 09. 2026జహీరాబాద్ ఎన్జీఎస్ కాలనీలో ఘనంగా గణేశ్ ఉత్సవాలుహనుమాన్ టెంపుల్ వద్ద భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. చిల్లమామిడి వైశ్యాస్ ఆధ్వర్యంలో 500 మందికి అన్నదానంజహీరాబాద్ పట్టణంలోని ఎన్జీఎస్ కాలనీ హనుమాన్ టెంపుల్ వద్ద నిర్వహిస్తున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.ఈ సందర్భంగా ఝరాసంగం మండలం చిల్లమామిడి గ్రామానికి చెందిన వైశ్యాస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 500 మంది భక్తులు, ప్రజలకు అన్నదానం చేశారు. భక్తులకు ప్రేమతో భోజనం వడ్డించి, గణేశుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు.అన్నదాన కార్యక్రమానికి హాజరైన భక్తులు నిర్వాహకులను అభినందించారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదానం చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని పలువురు పేర్కొన్నారు. భక్తి, సేవా భావంతో కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించి, గణనాథుడి కృపతో చిల్లమామిడి వైశ్యాస్ కుటుంబాలు, నిర్వాహకులు, భక్తులు సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు. ప్రజల ఆశీస్సులు, దైవానుగ్రహం ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.గణేశ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించు కుని ప్రతి రోజు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడి ఆశీస్సులు పొందాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో చిల్లమామిడి గ్రామానికి చెందిన వైశ్యాస్, భక్తులు, స్థానిక ప్రజలు, కాలనీ వాసులు తదితర హనుమాన్ టెంపుల్ పరిసరాలు మార్మోగాయి.
