
జనం న్యూస్ అక్టోబర్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి పరకాల ప్రాజెక్టు పరకాల సెక్టర్ లోని శ్రీనివాస కాలనీ అంగన్వాడి కేంద్రంలో 9వ రాష్ట్రీయ పోషణ మాసం సందర్భంగా కార్యక్రమం చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ ఎం రోజారాణి మాట్లాడుతూ ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో అందించే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని సులభంగా లభించే పండ్లు ఆకుకూరలు కూరగాయలు ఆహారంతో భాగంగా తీసుకోవాలని తెలిపారు 0-3 సంవత్సరాల వయస్సు గల పిల్లలను నమోదు చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది పిల్లల్లో అభివృద్ధి ఆలస్యాలు లేదా సంబంధిత సమస్యలను గుర్తించి అవసరమైన పిల్లలను ఆర్ బీ ఎస్ కే బృందాల ద్వారా తగిన పరీక్షలు వైద్య సేవలు వేగవంతంగా రిఫర్ చేయాలని గర్భిణీలకు బాలింతలకు తల్లులకు తెలియజేయడము జరిగింది ప్రతి రోజు పౌష్టికాహారము చేసుకోవాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ కే రమా ఆయా భద్రమ్మ గర్భిణీలు బాలింతలు పిల్లలు హాజరైనారు.