జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం అక్టోబర్ 22. 10. 2026జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలం గినియార్పల్లి గ్రామంలోని దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో గ్రామ సర్పంచ్ కుమ్మరి రాజేశ్వరి గోపాల్ ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కుమ్మరి రాజేశ్వరి గోపాల్ గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు.
