
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం నవంబర్ 17. 11. 2026 జహీరాబాద్ నియోజకవర్గం జర సంఘం మండలం
గినియార్‌పల్లి గ్రామానికి సంబంధించిన సీఎంఆర్ చెక్కును పార్లమెంట్ ఇన్చార్జి చేతుల మీదుగా గ్రామానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీఎంఆర్ చెక్కును పావని శ్రీనివాస్‌కు అందజేశారు. గ్రామానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే పనుల నిర్వహణకు ఈ చెక్కు ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుమ్మరి రాజేశ్వరి గోపాల్, ఎన్. బాబు, మహమూద్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నాయకులు చర్చించారు. గ్రామానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.