
జనం న్యూస్ అక్టోబర్ 19, ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: అనంతపూర్ లోని గోశాలలో దాతల సహకారంతో, శ్రీవారి సేవకుల ఆధ్వర్యంలో నిరంతరం కొనసాగుతున్న గో సేవ కార్యక్రమం ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది. ఈరోజు దాత హనుమంతు 50 కిలోల బియ్యపు రవ్వ, బెల్లం కలిపి గోవులకు ఆహారంగా అందించారు. గోమాతకు సేవ చేయడం వల్ల గోవిందుని దయ కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు, దాతలు ఎవరైనా ఉచితంగా పాల్గొని గోమాత ఆశీస్సులు పొందవచ్చని పిలుపునిచ్చారు. వివరాలకు ఆళ్లగడ్డ రాము 98494 13713 ను సంప్రదించాలని కోరారు.*గోవిందా గోవిందా - ఓం నమో వెంకటేశాయ*