
(జనం న్యూస్ కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ ) మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలలో శుక్రవారం మునగాల గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ దేవిరెడ్డి స్వప్న కు వైద్యశాల నందు విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ ఆఫీసర్ జ్యోతి ఆధ్వర్యంలో,ప్రాథమిక వైద్యశాల సిబ్బంది సాధారణ డెలివరీ చేయగా స్వప్న బాబుకు జన్మనిచ్చిందని తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని నర్సింగ్ ఆఫీసర్ జ్యోతి తెలిపారు. గర్భిణీ మహిళా దేవిరెడ్డి స్వప్న శుక్రవారం ఉదయం నొప్పులతో వైద్యశాలలో అడ్మిట్ కాగా,వెనువెంటనే స్పందించిన నర్సింగ్ ఆఫీసర్ జ్యోతి తన సిబ్బందితో కలిసి సాధారణ డెలివరీ చేయగా మూడు 3.8కేజీల బాబుకు స్వప్న జన్మనిచ్చిందని.గతంలో కూడా ప్రభుత్వ వైద్యశాల నందు స్వప్నకు మొదటిసారి సాధారణ ప్రసవం ద్వారా పాపకు జన్మనిచ్చినట్లు ఆమె తెలిపారు.సాధారణ ప్రసవం ద్వారా తన భార్య కుమారుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని దేవిరెడ్డి స్వప్న భర్త దేవిరెడ్డి శ్రవణ్ రెడ్డి అన్నారు.వైద్యశాలలో సదుపాయాలు మరియు వైద్య సిబ్బంది గర్భిణీ మహిళల పట్ల ప్రత్యేక చొరవ తీసుకొని వైద్య సహాయం అందిస్తున్న తీరు అభినందనీయమని,వేల రూపాయలు ప్రైవేటు వైద్యశాలలో ఖర్చుపెట్టే కన్నా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది సేవలను వినియోగించు కోవాలని కోరుతూ వైద్యశాల నర్సింగ్ ఆఫీసర్ జ్యోతి,ఎమ్ ఎల్ హెచ్ పి పూజ మరియు వైద్య సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.