
(జనం న్యూస్ మే 11 కందిబండ హరీష్ మునగాల మండల) మునగాల మండలం నరసింహాపురంలోని ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడాలని సర్పంచ్ వేమూరి సత్యనారాయణ కోదాడ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం కేటాయించిన ఖాళీ స్థలాలను కొందరు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. అలాగే ముస్లిం కబరస్తాన్ స్థలాన్ని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజా వాణిలో స్పందించిన ఆర్డీవో.. దీనిపై తక్షణమే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.