
జనం న్యూస్ అక్టోబర్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శి రాజారాం ఆధ్వర్యంలో సర్పంచ్ గజ్జి ఐలయ్య , ఉప సర్పంచ్ తుడుం రాజు లు మల్టీపర్పస్ సిబ్బందికి పారిశుద్ధ్య యూనిఫాంలు కాకి చొక్కా, కాకి ప్యాంటు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రతే గ్రామ అభివృద్ధికి మొదటి మెట్టు అని, మల్టీపర్పస్ సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. గ్రామంలో ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ, డ్రైనేజీల శుభ్రత, వీధుల ఊడ్పు వంటి పనుల్లో వారు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. సిబ్బందికి యూనిఫాంలు ఉండటం వల్ల విధుల్లో గుర్తింపు, భద్రత, క్రమశిక్షణ పెరుగుతుందని కార్యదర్శి రాజారాం తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్ర, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు సిబ్బందికి అన్ని వసతులు కల్పిస్తామని, తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు, హరితహారం వంటి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గజ్జి రాజు, గజ్జి రమేష్, కందకట్ల ప్రవీణ్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.