
జనం న్యూస్ నవంబర్ 23 మమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ నెల 26వ తేదీన జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కడలి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంచర్ల సురేఖను అఖండ మెజార్టీతో గెలిపించాలని కంచర్ల వెంకట్రావు (బాబి) గ్రామ ఓటర్లను కోరారు. కంచర్ల సుబ్బయ్య కుమారుడు శేఖర్ భార్య అయిన కంచర్ల సురేఖకు తమ కుటుంబం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. గతంలో తమ కుటుంబం గ్రామ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించి, రాబోయే రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు సురేఖకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు, ఓటర్లు ఐక్యంగా నిలిచి సురేఖకు మద్దతు తెలపాలని, ఆమె ఎన్నికల గుర్తు మంచంపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కంచర్ల వెంకట్రావు (బాబి) పిలుపునిచ్చారు. గ్రామంలో త్రాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు సురేఖ ప్రత్యేక కృషి చేస్తారని ఆయన తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల సంక్షేమం, విద్యా, వైద్య సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు అందరూ ఏకమై సురేఖను గెలిపిస్తే కడలి గ్రామం ఆదర్శ గ్రామంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు పెద్దలు, యువకులు సురేఖకు మద్దతు ప్రకటించారు.