
జనం న్యూస్ మే 9 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి హిందూ దేవాలయాల్లో దర్శనం, అర్చనలు, కొబ్బరికాయలు కొట్టడం వంటి ఆధ్యాత్మిక ఆచారాలపై జీఎస్టీ లేదా ఇతర పన్నులు విధించడం పట్ల భక్తుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాదె శివ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మోడీ సార్, హిందూ దేవాలయాల్లో దర్శనం, అర్చనలు, కొబ్బరికాయలు కొట్టడంపైనా పన్నులు వేస్తే సాధారణ భక్తుడు ఎలా భక్తి చేయగలడు? హిందూ సోదరుల మనోభావాలను గౌరవించి దేవాలయాలపై జీఎస్టీ విధానాన్ని పునరాలోచించాలి” అని కోరారు.దేవాలయాలు వ్యాపార కేంద్రాలు కాదని, అవి భక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలని ఆయన పేర్కొన్నారు. ఇతర మత ప్రార్థనా స్థలాల విషయంలో ఇలాంటి పరిస్థితులు కనిపించకపోతే, హిందూ దేవాలయాలపై మాత్రమే పన్నుల భారం పడుతోందనే భావన భక్తుల్లో కలుగుతోందన్నారు.ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం హిందుత్వ పేరుతో రాజకీయాలు చేసే బిజెపి నాయకులు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని గాదె శివ సూచించారు. హిందూ భక్తుల మనోభావాలను గౌరవిస్తూ దేవాలయాలపై జీఎస్టీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సూచించారు