
జనం న్యూస్, సెప్టెంబర్ 21,అచ్యుతాపురం : తెలుగు సాహితీ లోకానికి అభ్యుదయ భావజాలాన్ని పరిచయం చేసిన మహాకవి, సంఘ సంస్కర్త,‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అంటూ సమాజాన్ని మేల్కొలిపిన మహకవి గురజాడ అప్పారావు జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ఆయన సేవలకు సరైన గౌరవం దక్కిందని జన విజ్ఞాన వేదిక నాయకులు, ఉపాధ్యాయులు మారిశెట్టి వెంకట అప్పారావు హర్షాన్ని వ్యక్తం చేశారు.తెలుగు భాషకు వన్నె తెచ్చిన మహాకవి గురజాడ అప్పారావు అని పేర్కొన్నారు.మహారచయిత గురజాడ అప్పారావు జయంతి వేడుకలను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తిమ్మరాజుపేట నందు నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.గురజాడ రచనల్లోని సామాజిక చైతన్యం, మానవతా దృక్పథం నేటి తరానికి ఎంతో స్ఫూర్తి దాయకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మాతృభాష పట్ల అభిమానం పెంపొందించుకోవలని ఆయన పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త ఈరుగుల భారతి , రూప పిల్లలు పాల్గొన్నారు.