
జనం న్యూస్ 15 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ జిల్లా కోర్టు సముదాయాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన హైకోర్టు జడ్జి.జోగులాంబ గద్వాల జిల్లాలో శనివారం హైకోర్టు న్యాయమూర్తి పుల్ల కార్తీక్ పర్యటించారు. ఉదయం ఎర్రవల్లి మండలం పదో బెటాలియన్ అతిథి గృహం వద్ద న్యాయమూర్తికి జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ చక్రవర్తి, ఇతర అధికారులు మొక్కలు, పుష్పగుచ్చాలు అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అతిథి గృహం వద్ద కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం న్యాయమూర్తి గద్వాల మండలం, పూడూరు గ్రామ రెవెన్యూ పరిధిలో నిర్మించనున్న జిల్లా కోర్టు సముదాయాల నూతన భవన నిర్మాణాల స్థలమును పరిశీలించారు. హైకోర్టు న్యాయమూర్తికి భవన నిర్మాణం పనుల గురించి అధికారులు వివరించారు. ఈ పర్యటనలో అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసులు, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకటేష్, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ నిష్కా పాత్రుడు, ఆర్డీవో శ్రీనివాసరావు డిఎస్పి మొగిలయ్య, బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ ఆదినారాయణ, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జారీ చేయువారు: డీపీఆర్ఓ జోగులాంబ గద్వాల జిల్లా.