
బిచ్కుంద అక్టోబర్ 4 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం హాస్గూల్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ హన్మంత్ బాలాజీ మాతృమూర్తి కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారు హాస్గూల్ గ్రామంలోని హన్మంత్ బాలాజీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, హన్మంత్ బాలాజీతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారికి ధైర్యం చెప్పారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు హాస్గూల్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.