
జనం న్యూస్ అక్టోబర్ 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జర్నలిస్టుల కోర్కెల దినం పురస్కరించుకొని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపుమేరకు అనకాపల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర హోం మంత్రి అనితకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించడం జరిగింది. ముందుగా అనకాపల్లి జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు . అనంతరం జర్నలిస్టుల సమస్యలపై నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ ఈ ఎం జే ఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆళ్ల వెంకట అప్పారావు, సీనియర్ జర్నలిస్టు మద్దాల రాంబాబు, అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మల్ల భాస్కరరావు, భీమరశెట్టి గణేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చాగంటి సర్వారావు (అవ్వ) తదితర విలేకరులు పాల్గొన్నారు.//