
జనం న్యూస్ 13 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా బౌండరీ మ్యాపింగ్ ఖచ్చితంగా పూర్తి చేయాలిఇంటింటి గణనలో ప్రతి ఇల్లు లెక్కించాలనీ బౌండరీ మ్యాపింగ్ ఖచ్చితంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారుధరూర్ మండలం మార్లబీడు గ్రామంలో బుధవారం కలెక్టర్ జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పరిశీలిస్తూ ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు మరియు సంబంధిత సిబ్బందితో నేరుగా మాట్లాడి పనితీరును సమీక్షించారు ఎన్యుమరేటర్లు తమ పరిధిలోని బౌండరీలు రోడ్లు లైన్లు ఇంటి నంబర్లపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఆదేశించారు మ్యాపింగ్ ప్రక్రియలో చెరువులు రహదారులు, దేవాలయాలు, చర్చిలు పాఠశాలలు వంటి ప్రాంతాలను కూడా స్పష్టంగా గుర్తించాలని సూచించారు. పెన్సిల్‌తో డాటెడ్ లైన్లు ఉపయోగిస్తూ సరైన మ్యాప్ తయారు చేయాలని తెలిపారు ఇంటి నంబర్లు సక్రమంగా మార్కింగ్ చేయాలని ఒకే కప్పు కింద ఉన్న ఇళ్లకు కూడా స్పష్టమైన నంబరింగ్ విధానం పాటించాలని సూచించారు ఎన్యుమరేటర్ లు తమ బ్లాక్ పరిధిలో ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు కవర్ చేశారో జనాభా అంచనాలు, మ్యాప్ పూర్తిస్థాయి వివరాలు అడిగి తెలుసుకున్నారు సూపర్వైజర్లు చార్జి అధికారులు క్రమం తప్పకుండా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఎన్యుమరేటర్లకు అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ సిబ్బందిపై పూర్తిగా ఆధారపడకుండా ప్రతి ఎన్యుమరేటర్ తమ పరిధిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మ్యాప్ ఆర్ పూర్తయిన వెంటనే దాన్ని పరిశీలించి భద్రపరచాలని ప్రతి ఇంటికి మార్కర్‌తో నంబర్లు స్పష్టంగా వేయాలని ఆదేశించారు. గణన ప్రక్రియను అత్యంత బాధ్యతగా తీసుకొని ఖచ్చితమైన గణాంకాలు నమోదు చేయాలని, ఫీల్డ్ స్థాయిలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.ఈ పర్యటనలో తహసిల్దార్ నందిని, సూపర్వైజర్ లు తదితరులు పాల్గొన్నారు.జారీ చేయువారు: డీపీఆర్ఓ జోగులాంబ గద్వాల జిల్లా