
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం సెప్టెంబర్ 27. 09. 2026 జహీరాబాద్, సెప్టెంబర్ 27: జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామంలో హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం 190వ పల్లె సంకీర్తన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హరినామ సంకీర్తనలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.హరే కృష్ణ, హరే రామ నామస్మరణతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు కీర్తనలు, భజనలు చేస్తూ గ్రామంలో సంకీర్తన నిర్వహించారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం, భక్తి భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పల్లె సంకీర్తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.గ్రామస్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని హరినామ సంకీర్తనను ఆస్వాదించారు. కార్యక్రమం భక్తి భావంతో, ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది.