
జనం న్యూస్ సెప్టెంబర్ 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల వ్యవసాయ అధికారి కుమారి మార్క ప్రియదర్శిని మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులతో పరస్పర చర్చ నిర్వహించి, యూరియా బుకింగ్‌కు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోని యూరియా బుకింగ్ యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు తమకు అనుకూలమైన విధానంలో యూరియాను బుక్ చేసుకోవచ్చని, మార్క ప్రియదర్శిని తెలిపారు. డీలర్ అవుట్లెట్ వద్ద, స్వయంగా యాప్ ద్వారా లేదా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించడం ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు. అదేవిధంగా మీ-సేవ కేంద్రాల ద్వారా రూ.15 యూజర్ ఛార్జీ చెల్లించి యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. రైతులు తమకు సౌకర్యవంతమైన విధానాన్ని ఎంచుకుని యూరియా బుకింగ్ చేసుకోవాలని, బుకింగ్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు.డి సి ఎస్ ప్రక్రియకు రైతుల సహకారం అవసరం డి సి ఎస్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని ఎం ఎ ఓ తెలిపారు. డి సి ఎస్ వాలంటీర్లు రైతులను ఫోన్ ద్వారా సంప్రదిస్తున్నందున, రైతులు వాలంటీర్ల కాల్స్‌కు స్పందించి అవసరమైన సమాచారాన్ని అందించాలని కోరారు.
ఇప్పటికే డి సి ఎస్ నమోదు పూర్తయిన ప్రాంతాలకు సంబంధించి ఏవైనా సవరణలు లేదా సమస్యలు ఉంటే, మెసేజ్ అందిన 48 గంటల్లోపు సంబంధిత ఎ ఇ ఓ లను ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలను తెలియజేయాలని ఎం ఎ ఓ ప్రియదర్శిని అన్నారుడి సి ఎస్ ప్రక్రియను వేగంగా, సజావుగా పూర్తి చేసేందుకు రైతులు వాలంటీర్లకు పూర్తి సహకారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు....