
జనం న్యూస్- సెప్టెంబర్ 19- నాగార్జునసాగర్ టౌన్ - తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ టి.యు డబ్ల్యూ జే (ఐ.జె.యూ) నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జర్నలిస్టుల ఇంటి స్థలాల కొరకు రెండు రోజుల రిలే నిరాహార దీక్ష చేపట్టటం జరిగింది.అందులో భాగంగా శనివారం నాడు నిరాహార దీక్ష నిర్వహిస్తున్న నల్గొండ జర్నలిస్టులకు సంఘీ భావం తెలిపిన నాగార్జునసాగర్, హాలియా టి.యూ.డబ్ల్యూ.జె (ఐ.జె.యూ) యూనియన్ కమిటీ సభ్యులు జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డి. శ్రీనివాస రెడ్డి,నాగార్జునసాగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పి. నర్సింహా, ప్రధాన కార్యదర్సులు టి.కె.ప్రకాష్ ముదిరాజ్, యండి. అబ్రార్ మొహినుద్దీన్.అనంతరం వారు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలనుండి జర్నలిస్ట్ వృత్తినే నమ్ముకొని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ జీత బత్యాలు లేకుండా సేవా చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేయటం జరిగింది.