
ఈ నెల 18వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు భవానీ మందిరం నుంచి భవనమ్మపల్లి తుల్జా భవానీ మాత ఆలయానికి పాదయాత్ర 13 వ పాదయాత్ర భక్తులకు విజయవంతం చేయగలరని భక్తులకు విజ్ఞప్తి జనం న్యూస్సం గారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం అక్టోబర్ 15. 10. 2026 జహీరాబాద్ నియోజకవర్గంలోని భవానీ మాత భక్తులు ఈ నెల 18వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు భవానీ మందిరం రోడ్డు వద్ద ఉన్న భవానీ మాత ఆలయం నుంచి భవనమ్మపల్లిలోని తుల్జా భవానీ మాత ఆలయానికి భక్తిశ్రద్ధలతో పాదయాత్రగా బయలుదేరనున్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందాలనే సంకల్పంతో భక్తులు ప్రతి సంవత్సరం ఈ పాదయాత్రలో పాల్గొంటూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్ల నేపథ్యంలో భవానీ మాత భక్తులు, జహీరాబాద్ పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. అమ్మవారి నామస్మరణతో, భక్తి భావంతో సాగనున్న ఈ పాదయాత్రలో భక్తులు క్రమశిక్షణతో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకోవాలని సూచిస్తున్నారు. పాదయాత్రలో పాల్గొనదలచిన భక్తులు ఆదివారం ఉదయం 9 గంటలకు భవానీ మందిరం రోడ్డు వద్ద ఉన్న భవానీ మాత ఆలయానికి చేరుకోవాలని కోరుతున్నారు. భక్తులందరూ ఐకమత్యంతో పాల్గొని తుల్జా భవానీ మాత ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు.